గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (21:48 IST)

ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి.. కవిత సీరియస్

kavitha
ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 
 
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కవిత డిమాండ్ చేశారు. కాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబంలో ఎమ్మెల్యే షకీల్ ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడి జరిగింది.