ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (06:30 IST)

ఛాయ్ పై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

అంతర్జాతీయ 'ఛాయ్ దినోత్సవం' సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.  బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 
బిస్కెట్‌ కప్పు..
టీ తాగేసి కప్పు తినేయాలి. టీ తాగడం ఓకే.. కప్పు తినడమేంటి అనుకుంటున్నారా.. అవునండీ.. అది బిస్కెట్‌ కప్పు కదా ! అందుకే తినేయాలి.

ప్రకృతిని కాపాడుకునే క్రమంలో భాగంగా.. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీ వినూత్న ఆలోచన ఇది. ఆచరణలో పెట్టడమే తడవు... మాంచి గిరాకీ అందుకుంది. బిస్కెట్‌ కప్పు టీ వ్యాపారం జోరు జోరుగా ఊపందుకుంది.