సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (17:11 IST)

'అంబటి కాంబాబు..' బుద్దా వెంకన్న సెటైరికల్ ట్వీట్లు

నిత్యం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించే వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి తీవ్ర ఝలక్ ఎదురైంది. ఆయనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సెటైరికల్ ట్వీట్లు చేశారు. అంబటిని 'కాంబాబు' అంటూ విమర్శల వర్షం గుప్పించారు. 

లాక్ డౌన్‌తో ఆయన కష్టాలు అన్నీ, ఇన్నీ కావని కామెంట్ చేసిన బుద్దా.. హైదరాబాద్‌లో అలవాటైన గెస్ట్ హౌస్ క్వారంటైన్‌లోకి వెళ్లలేక హక్సీ వాయిస్ మిస్ అవుతున్నట్టున్నారని ట్వీట్ చేశారు.

ఆ ఫ్రస్ట్రేషన్‌లో నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ఇలానే హక్సీ వాయిస్‌తో పట్టుబడ్డారని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు అసలే పదవి తోడయ్యింది.

ఇక ఎంత మందిని వేధిస్తాడో. ప్రత్యేక అనుమతులు ఇచ్చి హైదరాబాద్ గెస్ట్ హౌస్ క్వారంటైన్‌లోకి పంపకపోతే కాంబాబు ఏపిలోనే హస్కీ వాయిస్ ప్రయోగిస్తారు’’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.