ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2022 (22:58 IST)

మునుగోడు ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్, కారుదే జోరు

AARAA
మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీ తెరాస విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. AARAA ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తెరాసకి 50.82 శాతం, భాజపాకి 33.86 శాతం, కాంగ్రెస్ పార్టీకి 10.94 శాతం, ఇతరులకు 4.38 శాతం ఓట్లు పడినట్లు వెల్లడించింది. మునుగోడులో తెరాసకి అడ్డే లేదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఐతే గతంలో దుబ్బాకలోనూ ఇలాగే చెప్పారు. అక్కడ తెరాసకి భంగపాటు కలిగింది.

 
అందుకే ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గం వ్యాప్తంగా శ్రమించి ప్రజలతో మమేకమయ్యారు. మద్యం, మనీ విపరీతంగా పంచినట్లు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఓటుకి రూ. 3 వేలు చొప్పున చివరిరోజున ఓటర్లకు అందినట్లు సమాచారం. మొత్తమ్మీద మునుగోడు ఉపఎన్నిక విజయం కోసం తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. మరి ఓటరు ఎవరికి పట్టం కట్టాడో తెలుసుకోవాలంటే నవంబరు 6 వరకూ వేచి చూడాలి.