మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (15:02 IST)

వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై హత్యా యత్నం, క్రికెట్ బ్యాట్‌తో దాడి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు సూరీడుపై దాడి జరిగింది. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లోని ఆయన గృహంలోనే ఇది చోటుచేసుకుంది.
 
సూరీడు అల్లుడు క్రికెట్ బ్యాటుతో అతడిపై దాడి చేశాడు. కాగా సూరీడు తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టాడు. ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ గత కొన్నిరోజులుగా అల్లుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు.
 
కానీ అల్లుడు చెప్పిన మాట ఖాతరు చేయకపోవడంతో బుధవారం నేరుగా ఇంట్లోకి ప్రవేశించి క్రికెట్ బ్యాటుతో దాడి చేశాడు. తన తండ్రిపై దాడి జరిగిందని ఆయన కుమార్తె గంగా భవాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.