1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (11:22 IST)

70 యేళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు : అసదుద్దీన్ ఓవైసీ

asaduddin owaisi
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 యేళ్లుగా ముస్లిం ప్రజలను అన్ని పార్టీల నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తరతరాలుగా ముస్లిం ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం రాజకీయ పార్టీలకు ఏమాత్రం నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయాలకు నచ్చదన్నారు. 
 
ముఖ్యంగా, మహత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని.. గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని భారత్‌‍లో మీరు నిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.