1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 13 జులై 2014 (13:35 IST)

ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న యాజమాన్యం!

టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను యాజమాన్యమే కూల్చివేసే చర్యలను ఆదివారం చేపట్టింది. ఇందులోభాగంగా.. ఆక్రమణ స్థలంలో నిర్మించిన ప్రాణంగాన్ని కూల్చి వేస్తున్నారు. 
 
హైదరాబాద్ మాదాపూర్‌లో నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ పేరుతో ఒక ఫంక్షన్ హాల్‌ను నిర్మించిన విషయం తెల్సిందే. అయితే, ఈ సెంటర్ నిర్మించిన స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. తుమ్మిడిగుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ యాజమాన్యం కూల్చివేస్తోంది. 
 
జీహెచ్ఎంసీ నుంచి అధికారికంగా నోటీసులు రాకముందే స్వచ్ఛందంగా కూల్చివేతలకు ఉపక్రమించడం గమనార్హం. అయితే, తమ నిర్మాణాలు చట్టబద్ధమైనవే అంటూ నాగార్జున హైకోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.