1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (16:33 IST)

నీట్‌పై తెలంగాణా వాదనలు.. వంద సీట్లు మేమే భర్తీ చేస్తాం... విచారణ 9కి వాయిదా

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను ఆలపించింది. రాష్ట్రంలోని వందశాతం సీట్లను తామే భర్తీ చేస్తామని తెలంగాణ తరపున వాదనలు వినిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది హరీశ్‌రావణ్‌ అన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు పరీక్ష నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది.
 
ఇకపోతే ప్రభుత్వ కళాశాలలకు ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చన్న ఎంసీఐ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ప్రైవేటు కళాశాలలకు నీట్‌ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. శని, ఆదివారాలు చర్చించి సోమవారం కోర్టు దృష్టికి తీసుకొస్తామని సొలిసిటర్‌ జనరల్‌ వివరించారు. అన్ని వాదనలు ఆలకించిన ధర్మాసనం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.