గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (13:46 IST)

తెలంగాణలో కొత్త సచివాలయం... ఏప్రిల్ 30న ప్రారంభం

telangana new secretariat
తెలంగాణలో కొత్త సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. రూ.617 కోట్లతో ఈ సచివాలయాన్ని నిర్మించారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా దీనికి పేరు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ సచివాలయం నుంచే తన పనులు చేపట్టనున్నారు.  
 
ఓ వైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకో వైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో ఈ సచివాలయాన్ని నిర్మించారు. 
 
ఈ సచివాలయంలో 635 గదులు, 875 తలుపులు ఉన్నాయి. 4 ఎంట్రన్స్‌లు, ఐదు అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. మొత్తం 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో సచివాలయం వుంది. 265 అడుగుల ఎత్తు ఉన్న సచివాలయాన్ని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. రూఫ్ టాప్‍లో స్కై లాంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.