శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (16:27 IST)

మేడారం జాతరకు వచ్చే భక్తులకు గమనిక.. ఇవి పాటించండి

మేడారం వద్ద భక్తులు
1) జాతరకు వచ్చే భక్తులు వారి యొక్క వాహనాలతో ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేయరాదు.
 
2) పోలీసులు సూచించిన మార్గాల మీదుగా మాత్రమే వాహనాలను నడపాలి.
 
3) వాహనాలను అనుమతి లేని చోట పార్కింగ్ చేయకుండా, సూచించిన చోట మాత్రమే పార్కింగ్ చేయగలరు లేదా మీ వాహనాలు పోలీస్ అధికారుల కంట్రోల్‌కి తరలించబడును.
మేడారం వద్ద భక్తులు
4) జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ఇతర భక్తులకు ఇబ్బంది కల్గించకుండా వ్యవహరించాలి.
 
5) అమ్మ వార్ల దర్శనానికి నిర్దేశించిన క్యూ లైన్లలో మాత్రమే వచ్చి దర్శనం చేసుకోవాలి, తద్వారా మీ దర్శనం సులభతరం అవుతుంది.
 
పోలిసుల నిఘాలో మరియు కంట్రోల్ CC టీవీ ఫుటేజ్ పర్యవేక్షాణ ద్వారా మీ చర్యలను ఎప్పటికపుడు మానిటరింగ్ చేయబడును. కావున భక్తులంతా జాగ్రత్తగా మెలిగి సహకరించగలరు. 
 
-ములుగు ASP పి.సాయి చైతన్య IPS.