సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:16 IST)

తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం.. గణపతి దేవుడి కాలానికి..?

తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం బయటపడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలోని శిథిలంగా మారిన శివాలయం వద్ద ఈ విగ్రహం బయల్పడింది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. 
 
ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
 
ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని తెలిపారు. 
 
త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని. మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.