మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (23:54 IST)

కరోనా కేసులు తగ్గినా.. ఆక్సిజన్ పడకలు నిండిపోతున్నాయి..

హైదరాబాదులో కరోనా కేసులు తగ్గినా.., ఆక్సిజన్ పడకలు మళ్ళీ కరోనావైరస్ రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ లెక్క 1,000 కేసుల కంటే తగ్గినప్పటికీ, యాక్టివ్ కేసులు మాత్రం 10,000 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు అధికారులు. అందులో 4073 మంది ఇప్పటికీ ఆసుపత్రులలో తమ ప్రాణాలతో పోరాడుతున్నారు.
 
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని డజను ఆస్పత్రులు తమకు ఆక్సిజన్‌పై గణనీయమైన సంఖ్యలో రోగులు ఉన్నట్లుగా చెబుతున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతోందని, కొన్ని ఆసుపత్రులలో పడకలు లేవని చెబుతున్నారు. కేసులలో పెరుగుదల ఉన్నందున, పడకలు నిండడం ప్రారంభం అయ్యిందని ప్రజలందరి కోసం అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్(థానా) అధ్యక్షుడు డాక్టర్ కిషన్ రావు అంటున్నారు.