దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం

pawan kalyan
శ్రీ| Last Updated: మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:04 IST)
శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రచారంపై దృష్టి సారించాయి. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత తరుపున మంత్రి
హరీష్ ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అగ్ర నాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరుపున ప్రచారం చేయడానికి పార్టీ జాతీయ నాయకులు రానున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా తయారైంది.

ఇక జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో దుబ్బాకలో ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని తెలంగాణా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నవంబర్ 3వ తేదీన దుబ్బాకలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్టోబరు చివరి వారంలో పవన్‌ను ప్రచారానికి పిలవాలని ప్రయత్నాలు చేస్తునట్టు సమాచారం. దీనికి జనసేన పార్టీ వర్గాలు సానుకూలంగా స్పందించాయి.

అయితే ఇప్పటివరకూ పవన్ పాలక టీఆర్ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. మరి పవన్
ప్రచార తీరు ఎలా ఉంటుంది. ఏయే అంశాలు పవన్ ప్రస్తావిస్తారు అనే అంశం సర్వత్రా ఆశక్తి కనబరుస్తోంది.
దీనిపై మరింత చదవండి :