మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (13:38 IST)

నాది తెలంగాణా... ఇక్కడా పోటీ చేస్తా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ఇప్పటివరకు ఎపిలోనే పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్‌ తెలంగాణా రాష్ట్రంపైనా దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు పవన్ కళ్యాణ్‌. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. నిన్న స్

ఇప్పటివరకు ఎపిలోనే పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్‌ తెలంగాణా రాష్ట్రంపైనా దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు పవన్ కళ్యాణ్‌. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్‌ ఈ విషయాన్ని పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారట. తెలంగాణా రాష్ట్రంలోనూ జనసేన పార్టీని విస్తరింపజేస్తామని, జనసేన సైనికులకు త్వరలో ఆహ్వానం పలుకుతామని చెప్పారట. 
 
తెలంగాణా వైపు పవన్ దృష్టిపెడుతుండటంతో అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. ఇప్పటికే సగం చచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. ఇంకా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదు. పవన్ కళ్యాణ్‌ లాంటి వ్యక్తి తెలంగాణా రాష్ట్రంలో పోటీ చేస్తే ఇక ఇబ్బందులు తప్పవు. దీంతో రెండు పార్టీల నేతలు ఆలోచనలో పడిపోయారు. 
 
ఎన్నికలకు సమయం ఉన్నా కొత్తగా మరో పార్టీ వస్తే ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయనేది వారి ఆలోచన. మరి పవన్ కళ్యాణ్‌‌ను బుజ్జగిస్తారో.. లేకుంటే ఎవరైనా పోటీ చేసుకోసుకోవచ్చని ఎన్నికల రణరంగంలో తేల్చుకునేందుకు సిద్థమవుతారో వేచి చూడాల్సిందే.