గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (12:00 IST)

హోటల్ బిర్యానీ ఆరగించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత

Biryani
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఓ హోటల్‌లో బిర్యానీ ఆరగించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల 18వ తేదీన నర్సాపూర్‌లోని ఓ మండి హోటల్‌లో మండి బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి ఇంట్లో ఆరగించారు. ఈ బిర్యానీ ఆరగించిన తర్వాత మొత్తం ఏడుగురు యువకులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
మెదక్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్ అనే యువకులు మండి హోటల్‌లో బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి, నర్సాపూర్‌కు చెందిన అజీజ్, మరో ఆరుగురు మిత్రులతో కలిసి ఆరగించారు. ఈ బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు కావడంతో అస్వస్థతకు లోనయ్యారు. 
 
వీరిలో మహేష్, షకీల్, నాని తదితరులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలివారు ఇంటివద్దనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రభుత్వం ఏరియా ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మీర్జానజీంబేగ్‌ను మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగానే వారికి వాంతులు విరేచనాలు అయినట్టు తెలిపారు.