ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (10:12 IST)

గచ్చిబౌలిలో వ్యభిచార గృహం గుట్టు రట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం గుట్టు రట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. రాఘవేంద్ర కాలనీలోని వైట్‌ హౌస్‌ ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ సభ్యులు హోటల్‌పై దాడి చేశారు.
 
ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. మహ్మద్‌ అదీమ్‌ అనే వ్యక్తి పలు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై సైబరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వివరించారు.