శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (10:59 IST)

రాకేశ్ మాస్టర్ మూడో భార్యపై మహిళలు దాడి.. కారణం ఏంటి?

Lakshmi
Lakshmi
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో ఐదుగురు మహిళలు ఒక్కసారిగా లక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. 
 
లక్ష్మి తన స్కూటర్‌పై వెళుతుండగా లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలతో వచ్చి ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. 
 
తనపై దాడి చేసిన వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వీళ్లందరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.