శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (19:27 IST)

హైదరాబాద్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కీసర మండలం  తిమ్మాయిపల్లి సమీపంలో ఓ ఫాం హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

విత్తన డీలర్ల కోసం  ఎరువుల కంపెనీక చెందిన  ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి  ఈరేవ్  పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 6 మంది యువతులతో పాటు  మరోక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కీసర సీఐ ఆధ్వర్యంలో పోలీసులు  దాడులు నిర్వహించారు, వీరిని కోర్టులో హజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.