శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:15 IST)

ఈటల భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి తెర : డీకే అరుణ

మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని అవి ఎన్నటికీ తీరని కలలుగానే ఉంటాయని అని డీకే పేర్కొన్నారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్‌కు పతనం చెందే సమయం దగ్గరకొచ్చిందని డీకే వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధమని అరుణ ప్రశ్నించారు.