గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (17:04 IST)

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. తెరాసలో చేరుతారా?

Venkatrami reddy
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. సీఎస్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. హైదారాబాద్‌లోని బీఆర్కే భవన్ దగ్గర మాట్లాడిన వెంకటరామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి, సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేశానని.. సీఎస్ ఆమోదించారని చెప్పారు. 
 
26 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వాలతో పనిచేసిన అనుభవం వుందన్నారు. వెంకటరామిరెడ్డి త్వరలో టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వరి విత్తనాలు అమ్మితే జైలుకు పంపిస్తానంటూ వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. గతంలో కేసీఆర్ పాదాలకు కూడా నమస్కరించి వివాదాస్పదంగా మారారు.
 
కాగా.. వెంకట్రామిరెడ్డి న్యాయవాదిగా పనిచేశారు. 1996లో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ తీసుకున్నారు. బందర్, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోగా పనిచేశారు. మెదక్ పీడీ డ్వామాలో డైరెక్టర్‌గా పనిచేశారు. హర్యానా అర్బన్ డెవ్‌లప్‌మెంట్ అథారిటీ సెక్రటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా మెదక్ జాయింట్ కలెక్టర్‌గా, సిద్ధిపేట, సంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్‌గా ఏడు సంవత్సరాల అనుభవం ఉంది.