ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (16:52 IST)

వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి రెండు నాగుపాములు..

వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి రెండు నాగుపాములు వచ్చి హల్‌చల్‌చేసిన సంఘటన జనగామ జిల్లా కేంద్రం లేబర్‌ అడ్డా ఏరియాలోని ఏబీవీ ఎయిడెడ్‌ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. 
 
మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఏఎన్‌ఎం స్వర్ణ, మెప్మా ఆర్పీ షాహీన్, ఇతర వైద్య సిబ్బంది సెంటర్‌కు చేరుకున్నారు. టీకా కార్యక్రమం ప్రారంభించేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సిబ్బందికి వేర్వేరు చోట్ల రెండు పాములు కనిపించడంతో... డోస్‌ల డబ్బాలు అక్కడే వదిలిపెట్టి భయంతో పరుగులు తీశారు. 
 
పక్కనే శిథిలమైన గదిలోకి ఓ పాము వెళ్లగా, మరొకటి మాత్రం టీకా సెంటర్‌లోనే ఉండి పోయింది. గంటపాటు పోరాడినా ఆ పామును వ్యాక్సిన్ సెంటర్ నుంచి బయటికి పంపలేకపోయారు. దీంతో వ్యాక్సిన్‌ సెంటర్‌ను పాతగోదాంల వద్ద ఉన్న సబ్‌సెంటర్‌కు తరలించారు.