తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కుమారుడు.. ఎక్కడ?  
                                       
                  
                  				  హైదరాబాద్ పట్టణంలోని గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి పాలిట కొడుకే కాల యముడు అయ్యాడు. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పటించి హత్యచేశాడు. పోలీసులు తేలిన వివరాల ప్రకారం దుర్గారావు అనే వ్యక్తి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో దుర్గారావు అతని కుమారుడికి మధ్య వివాదం జరుగుతుంది. 
				  											
																													
									  
	 
	ఈ నేపథ్యంలోనే మంగళవారం దుర్గారావుపై దాడికి దిగిన కుమారుడు.. అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు ఆర్పిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
				  
	 
	ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గారావు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటన విషయం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.