తెలంగాణాలో తీసికట్టుగా మారిన ఆదివాసీల బతుకులు : సుంకేట అన్వేష రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల బతుకులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. గిరిజనుల బతుకులను ప్రభుత్వం చిధ్రం చేసేలా వ్యవహరిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అటవీ ప్రాంతంలోని పోడు భూములపై హక్కులు కల్పించింది. హక్కులతో పాటు.. ఆయా భూములను రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలు కూడా మంజూరు చేసింది. పట్టాలు ఇచ్చిన భూముల్లో ఆదివాసీలు, గిరిజనులు అప్పటినుంచి ఇప్పటివరకూ.. వ్యవసాయం చేసుకుంటూ.. ఆర్థిక సాధికారత దిశగా కొద్దికొద్దిగా అడుగులు వేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరువాత ఏర్పడ్డ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలకు అంతకు ముందుకన్నా.. మేలు జరుగుతుందని ఆశిస్తే.. ఫలితాలు మాత్రం భిన్నాంగా ఉన్నాయి. ఇందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఉదంతమే సజీవ సాక్ష్యం. ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
గిరిజనులకు వ్యవసాయం చేసుకునేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిలో.. తొలకరి వర్షాలు పడడంతో వారంతా ఆయా భూముల్లో విత్తనాలు జల్లి వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లోపు.. ప్రభుత్వ అధికారులు హరితహారం కార్యక్రమం కోసం గిరిజన ఆదివాసీ భూములను చదును చేసేందుకు వచ్చారు. అధికారులను రెచ్చగొట్టింది..
ప్రభుత్వమే.. ఆ అధికారులపై దాడి చేసింది.. ఆ పార్టీ నాయకులే.. మధ్యలో అమాయక గిరిజన, ఆదివాసీలకు తీరని నష్టం కలిగింది. ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆదివాసీ, గిరిజనులు తమకు గత ప్రభుత్వాలు కేటాయించిన అటవీ పోడుభూముల్లో కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక.. గిరిజనులకు ప్రత్యేకంగా మరిన్ని సదుపాయలు కల్పిస్తారని ఆశించాం. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేటాయించిన పోడు భూములపై గిరిజనులకు, ఆదివాసీలకు హక్కులను తొలగిస్తూ, పట్టాలను రద్దు చేస్తూ.. వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారి జీవితాల్లో చీకట్లు నింపుతోంది.
టీఆర్ఎఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోడు భూముల సమస్యత రోజురోజుకూ తీవ్ర రూపంత దాలుస్తోంది. తొలకరి వర్షాలు పడ్డాక వారంతా విత్తనాలు జల్లుకుని.. పంటకు సిద్ధమయితే.. అధికారులు మాత్రం. ట్రాక్టర్లు, జేసీబీలో వాటిని ధ్వంసం చేస్తూ వస్తున్నారు. ఇది నాలుగేళ్లుగా జరుగుతోంది.
తాజాగా జరిగిన ఘటన కూడా ఇందుకు మినహాయింపుకాదు. గిరిజన రైతులు విత్తనాలు జల్లుకున్నాక.. అటవీ ప్రాంతం అంటూ అధికారులు ట్రెంచ్ కొట్టడం, భూములపై ట్రాక్టర్లతో చదునుచేయడం.. వంటివి జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ పోడు భూముల వద్ద ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో అనేక జిల్లాలలో వేలాది ఎకరాలు రైతులు సాగు చేసుకుంటుంటే రైతులకు ఉన్న పట్టా పసుపుస్తకాల సమస్య పరిష్కారం చేయకుండా మరో దిక్కు భూముల కు ట్రెంచి కొట్టుతూ ,జాలి చుట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.
మరో దిక్కు పెట్టుబడి దారులకు మైనింగ్ కోసమని వేలాది ఎకరాలు అటవీ భూములను ధారాదత్తం చేస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల నుండి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా, పట్టాలు ఉన్నవారిని కూడా సాగు చేయనియకుండా ఇబ్బందులకు ప్రభుత్వం
గురిచేయడం హేయమైన చర్య. ఒక దిక్కు ప్రభుత్వమే భూముల నుండి రైతులను వెల్లగొట్టుతూ మరో దిక్కు అధికార పార్టీ వారే దాడులు చేస్తున్నా విధానాన్ని ఇటు ప్రజలు అటు అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా.. తప్పు తెలుసుకుని.. గిరజన, ఆదివాసీలకు పోడు భూములపై సర్వహక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా.