ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 14 మే 2016 (15:32 IST)

కేసీఆర్ జేజెమ్మ వచ్చి పిలిచినా పార్టీ మారను : నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ ప్రాంతానికి చెందిన సీయనిర్ రాజకీయ నేతల్లో నాగం జనార్థన్ రెడ్డి ఒకరు. ఈయన ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీలో నంబర్ టూగా వెలుగొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి వేరుపడి కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని భారతీయ జనతా పార్టీలో వినీనం చేశారు. ఆ తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ లేదా తెరాసలో చేరతారనే ప్రచారం జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నాగం జనార్థన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. బీజేపీలోనే ఉంటానని కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. 
 
అయితే, తనపై కావాలనే కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ సభ్యునిగానే కొనసాగుతానని నాగం చెప్పారు. కాగా గత కొంతకాలంగా నాగం... పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.