బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (21:54 IST)

17వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

bjp flags
తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఈనెల 17వ తేదీన విడుదల కానుంది. బీజేపీ అగ్రనేత ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. 
 
సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అమిత్ షా 17న ఒకేరోజు నాలుగు సభల్లో పాల్గొంటారు.

నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో జరిగే బహిరంగ సభలలో అమిత్ షా పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నవంబర్ 17న తెలంగాణకు రానున్నారు.