గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (23:06 IST)

తెలంగాణలో 800కి దాటిన కరోనా కేసుల సంఖ్య

telangana
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 800 దాటింది. గడిచిన 24 గంటల్లో 38,122 శాంపిల్స్ పరీక్షించగా, 836 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యధికంగా హైదరాబాదులో 443 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55, రంగారెడ్డి జిల్లాలో 52, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు గుర్తించారు.
 
అదే సమయంలో 765 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు.