గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:12 IST)

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు..

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. రెవెన్యూ శాఖలో భారీగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొందరు అధికారులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చకు దారితీసింది. 
 
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వీఆర్వో నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 
 
సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్ట్‌ పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు వీఆర్వోల నుంచి రికార్డులు తీసుకోవడంపై ఫోకస్ చేశారు. తహసీల్దార్ల నుంచి వీఆర్వో అదరికి ఆదేశాలు అందాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు ధృవీకరించారు.