గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (11:14 IST)

తెలంగాణ సర్కార్ సంచలనం-దళితులకు కీలక పదవులు

తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్యశాఖలో ఉన్న కీలక పదవులను దళితులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దళితులకు వైద్యశాఖలో ప్రమోషన్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పదవుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. దాంతో ఆ పదవుల్లో దళితులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రకటించి రాష్ట్రంలోని దళిత కుటుంబాలు అందరికీ రూ.10లక్షలు ఇస్తున్నారు. 
 
అంతేకాకుండా దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు వైద్య శాఖలో దళితులకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.