శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (10:31 IST)

ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులు రద్దు.. బుక్ చేసుకున్న వారికి చుక్కలు

Rtc
ఆర్టీసీ బస్సులు ఆకస్మికంగా రద్దు కావడంతో టికెట్ బుక్ చేసుకున్న వారికి చుక్కలు కనిపించాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా రద్దవుతున్న ఆర్టీసీ అధికారులు తెలపడం లేదు. దీంతో దూరప్రాంత బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ప్రయాణికులు తరచుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
 
మరోవైపు తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు మాత్రం ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద మొత్తం చెల్లించి ప్రయాణాలు చేస్తున్నారు. అయితే బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ముందే చేరవేయాలి. మరో బస్సు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 
 
కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయలేదేరవలసిన గరుడ ప్లస్‌ బస్సు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల బస్సు రద్దయినట్లు అధికారులు తెలిపారు. కానీ ప్రయాణికులకు ఆ సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు డివిజనల్‌ మేనేజర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.