సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (15:08 IST)

మామా... మీ కూతురు ఉరేసుకుని చనిపోయింది.. : అల్లుడి ఫోన్

suicide
తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్‌ సమీపంలోని చిలప్‌చడ్ మండలం గుజిరి తండా పంచాయతీ పరిధిలోని సీత్యా తండాలో శనివారం విషాదకర ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన ముడావత్ మహేష్, చంద్రియా తండాకు చెందిన రమావత్ జ్యోతి (20)లు గత యేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కొన్ని రోజులు పాటు హైదరాబాద్ నగరంలో కాపురం ఉన్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా తండాలోనే ఉంటున్నారు. ఈ నెల 11వ తేదీన జ్యోతికి కడుపు నొప్పి రావడంతో మహేష్ తన మామ సురేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 
 
సిరిపురలోని ఓ ఆస్పత్రిలో జ్యోతికి చికిత్స అందించామని, ఈ క్రమంలో శనివారం మామకు సురేష్ ఫోన్ చేసి... మీ కూతురు ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. వారు వచ్చి చూడగా మృతదేహంపై జ్యోతి మృతదేహం ఉంది. దీంతో అల్లుడిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా, ఈ విచారణలో జ్యోతిది ఆత్మహత్య కాదని, హత్య అని నిర్ధారించారు. 
 
ఈ క్రమంలో జ్యోతి బంధువులు మృతురాలి భర్త మహేష్, అత్తమామలను ఇంటిలోనే ఉంచి తాళం వేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో వారు స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మధార్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.