ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (06:48 IST)

తోడేలును దత్తత తీసుకున్నకుటుంబం... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎవరైనా పిల్లలను దత్తత తీసుకుంటారు. కానీ ఒక తోడేలును సంవత్సరంపాటు దత్తత తీసుకుని ఓ కుటుంబం అందరినీ ఆశ్చర్యపరచింది. అదెక్కడ అని అనుకుంటున్నారా..! ఇంకెక్కడ హైదరాబాద్‌ లో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్‌లో నివాసముంటున్న వి. రాఘవతేజ కుటుంబ సభ్యులు ఇటీవల నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ను సందర్శించడానికి వెళ్లారు. అక్కడ గ్రే కలర్‌లో ఉన్న తోడేలు కనిపించింది. చూడగానే దాన్ని పెంచుకోవాలనిపించిందట..

వెంటనే కుటుంబ సభ్యులు దాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై అక్కడిక్కడే నలభైవేల రూపాయల చెక్కును పార్కు నిర్వహణా బాధ్యతలను చూసుకునే ఐఎఫ్‌ఎస్‌ (క్షతిజ)కి అందజేశారు. ఇలా తోడేలును దత్తత తీసుకోవడంపై క్షతిజ కూడా ఆనందం వ్యక్తం చేశారు.