సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (09:33 IST)

ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆదివాసీ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన పాండా కామి అనే ఆదివాసీ మహిళ నిండుగర్భిణీ. ఈమెకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే, సహజకాన్పుకు తీవ్రంగా కష్టపడుతుండటంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఈమె వైద్యుల పర్యవేక్షణలో సహజంగానే ప్రసవించింది. ఈ కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. వీరంతా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మహిళ ఈనెల 13వ తేదీన బుధవారం జన్మించింది.