గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (13:47 IST)

తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

n-sat exam
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలన్న నిబంధన విధించారు. దీంతో విద్యార్థులంతా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా హాలుకు చేరుకున్నారు. 9 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. 
 
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 61 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్షల కోసం 1473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 26333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించారు.