శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 నవంబరు 2019 (18:00 IST)

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గగ్గోలు, తప్పని పరిస్థితుల్లో సమ్మె విరమణ: కేసీఆర్ రియాక్షన్ ఏంటి?

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే ఎట్టా వుంటుందో మరోసారి రుజువైంది. ఆయన పట్టు పట్టారంటే ఓ పట్టాన వదలరు. ఆర్టీసీ కార్మికులు గత 47 రోజులుగా బస్సులను వదిలేసి సమ్మె చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పట్టును వీడలేదు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సమ్మె సుదీర్ఘంగా సాగుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం రాకపోవడంతో కార్మికుల్లో ఓ రకమైన ఆందోళన ఏర్పడింది. 
 
గత రెండు నెలలుగా జీతాలు లేక మలమల మాడిపోతున్నారు. దీనితో ఇక సమ్మె తమ వల్ల కాదని చాలామంది నాయకుల వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా ఆర్టీసి సమ్మె వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందోనన్న జంకు కార్మికుల్లో నెలకొంది.

దీనితో సమ్మెను విరమించడమే మంచిదని అధికులు అభిప్రాయపడటంతో ఆర్టీసి సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఐతే కార్మికులకు ఎలాంటి షరతులు పెట్టకుండా, విధుల్లోకి తీసుకోవాలంటూ కండిషన్ పెట్టారు. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.