గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (09:08 IST)

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సీఎం యోగి పూజలు

bhagyalakshmi temple
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి యోగి ఆధిత్యనాథ్‌ స్వయంగా హారతినిచ్చారు. 
 
ఆ సమయంలో ఆయన వెంట తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆయనతో పాటు ఉన్నారు. భాజపా నేతల పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు.