శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:19 IST)

నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థిగా రాములమ్మ?

నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిగా సినీనటి, రాములమ్మ విజయశాంతి పేరును బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆమె అభ్యర్థిత్వంపై నల్లగొండ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేశారు.

సినీగ్లామర్‌తో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్న తీరు పార్టీకి కలిసొస్తుందని వారు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది డిసెంబరు 7న విజయశాంతి తిరిగి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయి నాయకులు, కేడర్‌ రాష్ట్ర పార్టీకి నివేదించడం ఆసక్తికరంగా మారింది.