గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:11 IST)

మహిళా ఉద్యోగినిపై వరంగల్ నిట్ డిప్యూటీ రిజిస్ట్రార్‌ లైంగిక వేధింపులు

venkateswara rao
తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్.ఐ.టి)లో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది. నిట్ డిప్యూటీ రిజిస్ట్రారుపై ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో డిప్యూటీ రిజిస్ట్రారుగా వెంకటేశ్వర రావు పని చేస్తున్నారు.
 
ఈయనపై కాజీపేటకు చెందిన నిట్ మహిళా సెక్యూరిటీలు లైంగిక ఆరోపణలు చేయడమే కాకుండా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నట్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.