శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (17:32 IST)

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తెలంగాణాలో దంచికొడుతున్న వానలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. 
 
శుక్రవారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నారాయణపేట జిల్లా మాగనూర్‌లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, మహారాష్ట్రపై గాలులతో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఉన్నట్టు అధికారులు వివరించారు.