గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 30 జూన్ 2021 (15:45 IST)

రేవంత్ రెడ్డిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే దిశగా ముందుకు సాగుతున్నారు వై.ఎస్.షర్మిళ. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తెలంగాణా వేదికగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పార్టీ జెండాను తెలంగాణాలో ఎగురవేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
 
అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో షర్మిళ కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ రెడ్డిపైనా తీవ్ర విమర్సలు చేశారు. అస్సలు రేవంత్ రెడ్డి నియమకం చూస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా సాగుతున్నామన్నారు.
 
ఖచ్చితంగా తెలంగాణాలో రాజన్న రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం, నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు అవసరమన్నారు. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్సించారు. కరోనా కష్టసమయంలో టిఆర్ఎస్ చేసింది శూన్యమంటూ షర్మిళ విమర్సలు చేశారు.