బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (16:37 IST)

షర్మిల పార్టీ ఆవిష్కరణ : ఇది ఓ మహాయజ్ఞం

తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన షర్మిల... తన పార్టీకి తండ్రి పేరు మీదుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేశారు.
 
అంతకునుందు ఆమె ట్విట్టర్‍లో తన మనోభావాలను పంచుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. "అమ్మ పక్క నుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.