బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (20:45 IST)

షర్మిల కీలక సమావేశం.. జూలై 8న పార్టీ ఆవిర్భావం..

తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్‌ చేశారు. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం అన్ని జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.. బుధవారం ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్‌లో ఈ సమావేశం జరగనుండగా… జూలై 8న పార్టీ ఆవిర్భావం, పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలు, పాదయాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. 
 
కాగా, ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన షర్మిల.. వారి అభిప్రాయాలను తీసుకున్నసంగతి తెలిసిందే.. మొదటల్లో అభిప్రాయ సేవకరణకే పరిమితం అయినా.. తర్వాత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించడం చేశారు.. ఇక, ఖమ్మం వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.. పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించారు.. ప్రజా సమస్యలపై దీక్షలు సైతం చేస్తున్నారు.