గోవిందుడు అందరివాడేలే: పిలకతో రామ్‌చరణ్‌, ఓణీతో కాజల్‌!

Kajal, Ramcharan
Selvi| Last Updated: సోమవారం, 28 జులై 2014 (13:07 IST)
హీరోయిన్లు కొత్తగా వుండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలుకూడా అలానే వుంటారు. సినిమా ఆరంభంనుంచి పెద్ద హీరోల గెటప్‌లు ఏమాత్రం బయటపెట్టరు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న "గోవిందుడు అందరివాడేలే" చిత్రంలో రామ్‌చరణ్‌ విదేశాలనుంచి ఇండియా వచ్చిన వ్యక్తిగా నటిస్తున్నాడు.

జుట్టును పిలకలా లేటెస్ట్‌ స్టైల్‌లో మార్చుకుని చెర్రీ కొత్తగా కన్పిస్తున్నాడు. ఈ గెటప్‌ ఇంకా బయటకు రాలేదు. కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తన గెటప్‌ను ట్విట్టర్‌లో పెట్టేసింది. వోణి కట్టేసి.. తెలుగుంటి అమ్మాయిలా కన్పిస్తుంది. ఇటువంటి చిత్రాల్లో ఇలాగే వుండాలని తన గెటప్‌ అందరికీ నచ్చుతుందని చెబుతోంది.

ప్రస్తుతం పొల్లాచ్చిలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ రానుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :