ఆనందంతో రేపు ఎన్టీఆర్‌ 'రభస' శుభం సీన్‌

jr ntr, Santosh
IVR| Last Modified మంగళవారం, 22 జులై 2014 (19:01 IST)
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'రభస' స్విట్జర్లాండ్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ''నిన్నటితో మా 'రభస' చిత్రం స్విట్జర్లాండ్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకొని ఈ రోజు యూనిట్‌ వచ్చిన వెంటనే మా హీరో ఎన్టీఆర్‌కు కొడుకు పుట్టాడన్న శుభవార్త తెలిసింది. రేపు చిత్రంలోని అందరు ఆర్టిస్టులు పాల్గొనే శుభం షాట్‌ తీస్తాం. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఓ పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ వంటి కార్యక్రమాలు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.

ఆగస్ట్‌ 1న సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ఆడియోను వైభవంగా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి థమన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ అందించాడు'' అన్నారు.

దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ''యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మా 'రభస' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందర్నీ అలరించే విధంగా థమన్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇందులో ఎన్టీఆర్‌ పాట పాడడం విశేషం. ఈ పాట సినిమాకి ఓ స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన డాన్స్‌ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఎన్టీఆర్‌, థమన్‌ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుంది'' అన్నారు.

ఎన్టీఆర్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్‌. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్‌, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, అజయ్‌, నాగినీడు, శ్రావణ్‌, భరత్‌, రవిప్రకాష్‌, ప్రభాకర్‌, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ప్రేమ్‌రక్షిత్‌, శేఖర్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌,
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌),దీనిపై మరింత చదవండి :