శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (12:15 IST)

ఆ చిత్రం ఫ్లాప్ నా కెరీర్‌ను అంతం చేసింది : 'సింహాద్రి' హీరోయిన్

Ankitha
Ankitha
తాను నటించిన 'విజయేంద్ర వర్మ' చిత్రం తన సినీ కెరీర్‌ను అంతచేసిందని "సింహాద్రి" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అంకిత చెప్పుకొచ్చింది. 'విజయేంద్ర వర్మ' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ అది నెరవేరకపోవడంతో ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
"లాహిరి లాహిరి లాహిరిలో" సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అంకిత.. ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. 'ధనలక్ష్మి ఐ లవ్ యూ', 'ప్రేమలో పావని కళ్యాణ్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ''సింహాద్రి'' చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయి వంటింది. ఆ తర్వాత ఆమె అగ్ర హీరోయిన్‌గా అవతరిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అలా జరగలేదు. చివరకు ఇండస్ట్రీకి దూరమయ్యారు. 
 
'విజయేంద్ర వర్మ' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ చిత్రం హిట్ అయివుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే మనుగడ సాగించగలం అని చెప్పింది. 2004లో వచ్చిన 'విజయేంద్ర వర్మ' చిత్రం తర్వాత ఆమె 'మనసు మాట వినదు', 'రారాజు', 'ఖతర్నాక్' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. 
 
దీంతో 2009 నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. 2016లో విశాల్ జగపతి అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిపోయారు. అంకిత దంపతులకు ఇద్దరు కుమారులు.