ఆర్ఆర్ఆర్ రికార్డును లియో తిరగరాస్తుందా?
ప్రముఖ కోలీవుడ్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా నుంచి వరుసగా వచ్చిన పోస్టర్లు ఆసక్తి రేపగా.. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మేనన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించారు.
సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాను తెరకెక్కించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లియో మూవీ తొలి రోజే రూ.110 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనా ఉంది.
భారత్‌లో ఓపెనింగ్స్ రూ.60 కోట్లుగా, మిగతా ప్రపంచ దేశాల్లో రూ.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను లియో తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.