గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (17:57 IST)

మెగాస్టార్ డైరెక్టర్‌తో అఖిల్ మూవీ..! (video)

అక్కినేని అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడం... ఆ తర్వాత నటించిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఫ్లాప్ అవ్వడం తెలిసిందే. దీంతో అఖిల్ ఫస్ట్ సక్సస్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసారి అఖిల్‌కి సక్సస్ అందించే బాధ్యతను బొమ్మరిల్లు భాస్కర్‌కు అందించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీవాసు - వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటిస్తున్నాడు. సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా వలన ఆగింది.
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఇదే అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరితో అంటే మెగాస్టార్‌తో సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అని సమాచారం.
 
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి అఖిల్‌తో మూవీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అఖిల్‌తో కాదు బన్నీతో సినిమా చేయనున్నట్టు టాక్ బలంగా వినిపించింది. ఆ తర్వాత బన్నీతో కూడా కాదు.. ఎనర్జిటిక్ హీరో రామ్‌తో అంటూ ప్రచారం జరిగింది.
 
 ఇప్పుడు మళ్లీ మొదటకి వచ్చింది. అవును... సురేందర్ రెడ్డి అఖిల్‌తోనే సినిమా చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని.. కరోనా నుంచి బయటపడిన తర్వాత అఖిల్ - సురేందర్ రెడ్డి మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాక్.