ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (11:55 IST)

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

Allu Arjun, Pooja Hegde
Allu Arjun, Pooja Hegde
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ హిట్ పెయిర్. వారిద్దరూ మరోసారి జోడికట్టబోతున్నారు. ఇందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కసరత్తు చేస్తున్నారు. అలవైకుంఠపురంలో  చిత్రం ఎంతటి సక్సెస్ అయిందో తెలియందికాదు. ఈ సినిమాలో పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. పదేళ్ళపాటు ఈ సినిమాను చెప్పుకుంటారని అల్లు అరవింద్ అప్పట్లోనే స్టేట్ మెంట్ ఇచ్చారు. తాజాగా పుష్ప 2 సినిమా అన్నింటినీ మరిపించేలాచేసింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాచేయబోతున్నాడో చర్చ అభిమానుల్లోనూ నడుస్తోంది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం, అలవైంకుంఠపురంలో చిత్రానికి సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయ్. ఇందులోనూ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సినిమా రూపొందబోతోంది. ఇందుకు కథాచర్చలు కూడా మొదలయ్యాయి. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని మార్చి 15న సినిమాను ట్రాక్ ఎక్కించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్; త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన నిమాలు హిట్ అయ్యాయి. ఈసారి పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమాలో అల్లు అర్జున్ వున్నట్లు తెలిసింది. 
 
ఆమధ్య సంథ్య థియేటర్ ఉదంతం తర్వాత జైలునుంచి ఇంటికి వచ్చాక మొదటగా అల్లు అర్జున్ ను కలిసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటికే వీరికాంబినేసన్ వున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే మార్చి 15న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇందులో సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. థమన్, దేవీశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ వుంటుందా? లేదా బాలీవుడ్ నుంచి మ్యూజిషన్ ను తీసుకురానున్నారో చూడాలి. త్వరలో మరింత సమాచారం రానుంది.