విజయ్‌తో విడాకులు తీసుకున్నా.. ధనుష్ ఏం చేశాడు?: అమలాపాల్ (Video)

Amala paul
Amala paul
సెల్వి| Last Updated: మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (18:56 IST)
అమలాపాల్-కేఎల్ విజయ్ ప్రేమించి వివాహం చేసుకుని.. ఏడాదికి తర్వాత విడాకులు కూడా తీసుకునేశారు. ప్రస్తుతం అమలాపాల్ సినిమాలు చేస్తూ.. విజయ్ దర్శకుడిగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే తాజాగా అమలాపాల్, విజయ్‌ విడాకులకు కోలీవుడ్ హీరో, కొలవెరి సాంగ్ మేకర్ ధనుష్ కారణమయ్యాడనే వార్తలు గుప్పుమన్నాయి.

అంతేగాకుండా విజయ్‌ తండ్రి, నిర్మాత ఏఎల్‌.అళగప్పన్‌ చేసిన వ్యాఖ్యలు అమలాపాల్‌కు కోపం తెప్పించాయి. తన కుమారుడు విజయ్‌ విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణం అంటూ అళగప్పన్ చేసిన కామెంట్స్‌పై అమలాపాల్ స్పందించింది.

పెళ్లికి తర్వాత నటించనని చెప్పిన అమలాపాల్ ధనుష్ తన సినిమాలో నటించమని కోరడంతోనే యాక్టింగ్‌కు వెళ్లిందని చెప్పాడు. దీంతో, పెళ్లి జరిగాక నటించనని చెప్పిన అమలాపాల్‌ మళ్లీ నటించడానికి సిద్ధమై, అమలాపాల్‌, విజయ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు.

ఈ విషయంపై అమలాపాల్‌ను మీడియా ప్రశ్నించడంతో ఆమె కోపంతో ఊగిపోయింది. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు అడుగుతున్నారేంటని ఎదురుప్రశ్న వేసింది. విడాకులపై ఇప్పుడు చర్చ అనవసరమని తెలిపింది.

విడాకులు తీసుకోవాలనుకున్నది పూర్తి తన సొంత నిర్ణయమని చెప్పుకొచ్చింది. ఇందుకు ఎవ్వరూ బాధ్యులు కారని చెప్పింది. ఇతరుల వల్ల విడాకులు ఎవరైనా విడాకులు తీసుకుంటారా అని ప్రశ్నించింది. ఇంకో పెళ్లి చేసుకునేందుకు ఇంకా టైమ్ వుందని మీడియా అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

దీనిపై మరింత చదవండి :