శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (13:27 IST)

చలపాయ్ కామెంట్స్ : 'బాగా చెప్పావు శశి'... యాంకర్ రవికి వ్యతిరేకంగా యాంకర్ లాస్య.

"అమ్మాయిలు హానికరమా" అనే ప్రశ్నకు టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఇచ్చిన సమాధానం.. దానిపై యాంకర్ రవి స్పందన టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది.

"అమ్మాయిలు హానికరమా" అనే ప్రశ్నకు టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు ఇచ్చిన సమాధానం.. దానిపై యాంకర్ రవి స్పందన టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. దీంతో చలపతి రావు, యాంకర్ రవిలు లెంపలేసుకున్నారు. పైగా, తప్పు తమది కాదంటే.. తమది కాదు అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో యాంకర్ రవికి పలువురు మహిళా యాంకర్లు అండగా నిలిచారు. 
 
కానీ, వీజే శశి మాత్రం యాంకర్ రవిపై, చలపతిరావుపై విరుచుకుపడుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దాదాపు ఇప్పటివరకూ ఈ వీడియోకు 8 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను యాంకర్ లాస్య షేర్ చేయడం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. లేడీ యాంకర్లు రవికి మద్దతుగా నిలుస్తుంటే లాస్య మాత్రం శశి వీడియోను షేర్ చేయడమే కాకుండా... ‘బాగా చెప్పావు శశి... నీ వ్యాఖ్యలను నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 
 
యాంకర్ రవి, లాస్య కలిసి గతంలో అనేక షోలు చేశారు. అవన్నీ ప్రేక్షకులను బాగా ఆలరించాయి కూడా. అలాంటి లాస్య రవికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను షేర్ చేయడంపై ఇపుడు సరికొత్త చర్చ ఆరంభమైంది. ఈ వీడియో షేరింగ్‌తో యాంకర్ రవితో లాస్యకు ఉన్న విభేదాలు ఈ వ్యవహారంతో మరోసారి బయటపడినట్లయింది.