సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 జులై 2018 (12:44 IST)

బిగ్ బాస్ ఇంటి నుంచి యాంకర్ శ్యామల ఔట్... అసలు కారణం అదేనట...

బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ శ్యామల ఎలిమినేషన్ పైన ఇప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్యామల ఎలిమినేషన్ వెనుక బలమైన కారణం వుందంటున్నారు. అదేంటయా అంటే... శ్

బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ శ్యామల ఎలిమినేషన్ పైన ఇప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్యామల ఎలిమినేషన్ వెనుక బలమైన కారణం వుందంటున్నారు. అదేంటయా అంటే... శ్యామల కొడుకు పుట్టినరోజు ఈ నెలలోనే వస్తుందట. అందువల్ల అతడి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకే శ్యామల ఎలిమినేట్ అయినట్లు అనుకుంటున్నారు. 
 
శ్యామల వైల్డ్ కార్డుతో తిరిగి బిగ్ బాస్ ఇంటికి వస్తుందని అంటున్నారు. తన కుమారుడు పుట్టినరోజు వేడుక ముగిశాక ఆమె వస్తుందని చెప్పుకుంటున్నారు. గతంలో... అంటే బిగ్ బాస్ సీజన్ 1లో కూడా ముమైత్ ఖాన్ విషయంలో ఇలాగే జరిగింది. ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాక తిరిగి వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించింది. ఇప్పుడు యాంకర్ శ్యామల విషయంలోనూ ఇదే జరుగుతుందని అంటున్నారు. చూద్దాం... ఏం జరుగుందో?